Skip to content
Telugu Lyrics

Evaro Okaru Lyrics from Aknuram

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

పల్లవి:
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 1:
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 2:
చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ
దానికి లెక్క లేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్ప వెనక ఆపననీ కంటి నీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 3:
యుగములు సాగినా నింగిని తాకకా
ఎగసిన అలల ఆశా అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
పల్లవి:ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..ఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుఅటో ఇటో ఎటో వైపు..మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరిమొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరివెనుక వచ్చు వాళ్ళకు బాట అయినద…
Preview the status creator
SAMPLE
చరణం 2:చెదరకపోదుగా చిక్కని చీకటీమిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీదానికి లెక్క లేదు కాళరాతిరీపెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీరెప్ప వెనక ఆపననీ కంటి నీటినీసాగలేక ఆగితే దారి తరుగునాజాలి చూ…
Preview the status creator