ప్రియ ప్రియతమా రాగాలు || Priya priyatama ragalu Lyrics

ante_enti_fallback_image

ప్రియ ప్రియతమా రాగాలు || Priya priyatama ragalu Lyrics

ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు

ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు

నీ లయ పంచుకుంటుంటే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియ

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు

పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు

ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి

అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి

ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే

ప్రియ

శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా

షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా

ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక

నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక

నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే

ప్రియ

error: Content is protected !!