ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా || oke oka maata madilona dagundi mounanga lyrcis

ante_enti_fallback_image

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా || oke oka maata madilona dagundi mounanga lyrcis

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని …

చరణం 1
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ
తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని

చరణం 2
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలని

error: Content is protected !!