మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది || mamidi kommaku maa chilakammaku potte kudirindi lyrics

ante_enti_fallback_image

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది || mamidi kommaku maa chilakammaku potte kudirindi lyrics

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది..
కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..
మామిడి కొమ్మకు మాచిలకమ్మకు పొత్తే కుదిరింది..
కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..
మ్మ్..కొత్తావకాయే తనకంటి ఎరుపాయే..ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే..
కారాలు నూరే..సందళ్ళు కొలువాయే..కాలాలు మారే కథలే ఇక మొదలాయే..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..

ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో.. ఒంటరిగా చేరిందీ తీరం..
గుండెల్లో ఈ భారం..ఎందాకా నడిపిస్తుందో..తేల్చదుగా ఎన్నటికీ దూరం..
దారే పూలే పరిచీ కడదాకా నిన్నే రమ్మంటే..చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్థం ఉంటుందా..
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదౌతుందా..తెగువే ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాదా..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..

ఏ ఓటమి ఎదురైనా..ఆశే మీ వెన్నంటేనా..వేకువకై పరుగే ఆగేనా..
చినుకల్లే మొదలైనా..చిగురించిన పరిచయమేదో..చివరికి ఆ సంద్రంగా మారేనా..
నింగీ నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా..పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవదా..
ఏనాడు కలవని దిక్కులు కలిసిన వింతలు కంటికి ఎన్నొ కనబడలేదా..
చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..

error: Content is protected !!