ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
వెన్నదొంగవైనా..మన్నుతింటివా..కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా..
ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే..
ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..
నీలాల నింగికింద తేలియాడు భూమి..తనలోనే చూపించాడు..ఈ కృష్ణ స్వామి..
పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి..నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు…
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమే ఇక.. అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేదో..
అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం..జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం..
వేదాల సారమంతా వాసుదేవుడే..రేపల్లె రాగం తాళం రాజీవమే..
హే..ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
మత్స్యమల్లే..నీటినితేలి వేదములను కాచి..కూర్మరూపధారివై భువినిమోసినావే..
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే..నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావూ..
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు..కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు..
ఇక నీ అవతారాలెన్నున్నా..ఆధారం నేనై..నీ ఒరవడి పట్టా..ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే..
మదిలోని ప్రేమ నీదే మాధవుడా..మందార పువ్వే నేను మనువాడరా..
ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…వెన్నదొంగవైనా..మన్నుతింటివా..కన్నెగ…
నీలాల నింగికింద తేలియాడు భూమి..తనలోనే చూపించాడు..ఈ కృష్ణ స్వామి..పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి..నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు…నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమే ఇక.. అఙ్ఞానం రూపుమాప…