Skip to content
Telugu Lyrics

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో || eduta nilichindi chudu.. jalataru vennelemo lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ..

ఎదుట నిలిచింది చూ..డు..

నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ
అవునో..కాదో..అడగకంది నా మౌనం
చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..

నిన్నే చేరుకోలేక..ఎటెళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా
నీదో..కాదో..రాసున్న చిరునామా
ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ….

ఎదుట నిలిచింది చూడు..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమోఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమోమైమరచిపోయా మాయలో..ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ..
ఎదుట నిలిచింది చూ..డు..
Preview the status creator
SAMPLE
నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీకలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీఅవునో..కాదో..అడగకంది నా మౌనంచెలివో..శిలవో..తెలియకుంది నీ రూపంచెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా..ఆ….
ఎదుట నిలిచింది …
Preview the status creator