♪
Telugu Lyrics
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు || idigidigo naa ramudu edane koluvundinadu lyrics
0Views0Likes0Shares
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే
పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగాసీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమీ
మరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీ
నిలువ నీడ లేదిదేమీ !
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడుముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరెఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే