కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా || kokilamma.. badai chalinchu,maa sushila janakamma lyrics

ante_enti_fallback_image

కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా || kokilamma.. badai chalinchu,maa sushila janakamma lyrics

కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..

చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..
ఆశా,లతాలలోన ధ్వనించు తేనె సోన..వినేసి తరించి..తలొంచుకెళ్ళవమ్మా..

కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..

ఒకే పదం ..ఒకే విధం ..కహ..కహ..ఆ..ఆ..
అదే వ్రతం అదే మతం అనుక్షణం ..
నా వీణ రాగముంది..ప్రవాహ వేగముంది..అనంత గీతముంది ..అసాధ్య రీతి ఉంది..
చేరవమ్మా..చరిత్ర మార్చుకోమ్మా..శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ..ఖరీదు కాదులేమ్మ..

కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..
ఆశా,లతాలలోన ధ్వనించు తేనె సోన..వినేసి తరించి..

మావిళ్ళలో..నీ గూటిలో ఎన్నాళ్ళిలా..ఆ..ఆ..
మా ఊరిలో కచేరిలో పాడాలిగా..హా.హా..
చిన్నరి చిలక పైన సవాలు చేయకమ్మా..తూనీగ..తేనెటీగ..చప్పట్లు చాలవమ్మ..
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా..అదంత తేలికేం కాదులేమ్మ..ఎత్తాలి కొత్త జన్మ

error: Content is protected !!