ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ…ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా …
నా చూపుల దారులలో చిరు దీపం వెలిగేలా …నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా …
జ్ఞాపకాలే మైమరపు …జ్ఞాపకాలే మేకోలుపు …జ్ఞాపకాలే నిట్టూర్పు…జ్ఞాపకాలే ఓదార్పు …||ఏదో ఒక రాగం ||
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే …
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే …
తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే …
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం …చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం ..|| ఏదో ఒక రాగం ||
మెరిసే తారాలలో నీ చూపులు జ్ఞాపకమే …
ఎగసే ప్రతి అలలో నీ ఆసలు జ్ఞాపకమే …
కోవెల లోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే …
పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం …మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం …
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ…ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా …
నా చూపుల దారులలో చిరు దీపం వెలిగేలా …నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా …
జ్ఞాపకాలే మైమరపు …జ్ఞాపకాలే మేకోలుపు …జ్ఞాపకాలే నిట్టూర్పు…జ్ఞాపకాలే ఓదార్పు …