Skip to content
Telugu Lyrics

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళు || ghallu ghallu ghallu mantu merupalle thullu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు |నల్ల||
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లు వచ్చి సాగనీ తొలకరి అల్లర్లూ ఎల్లలన్నవే ఎరగని వేగం తో వెళ్లు

1|| లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయా నీలగతిలో సుమ బాలగా తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయెటికి నటనం నేర్పించే గురువెడి

తిరిగే కాలానికి తీరోకటుందీ అది నీ స్వార్ధానికి దొరకను అంది
నటరాజస్వామి జటా జుటీ లోకి చేరకుంటే విరుచుకు ప డు సురగన్గకు వి లువేముందీ
వి లువేముందీ

2| దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు

అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం

వద్దని ఆపలేరూ వురికె వూహని
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
వీరివనమున పరిమళముల వి లువేముందీ …. వి లువేముందీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళుఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు |నల్ల||పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
Preview the status creator
SAMPLE
ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లుఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళువెల్లు వచ్చి సాగనీ తొలకరి అల్లర్లూ ఎల్లలన్నవే ఎరగని వేగం తో వెళ్లు
1|| లయకే నిలయమై నీ పాదం సాగాలిమలయా నీలగతిలో సుమ…
Preview the status creator