Skip to content
Telugu Lyrics

ప్రేమ లేదని ప్రేమించరాదని || prema ledani premincharadani lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు

మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
మోడుబారి నీడ తోడు లేకుంటిని

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ప్రేమ లేదని ప్రేమించరాదనిప్రేమ లేదని ప్రేమించరాదనిసాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీఓ ప్రియా జోహారులు
మనసు మాసిపోతే మనిషే కాదనికటిక రాయికైనా కన్నీరుందనివలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదనిగడియ ప…
Preview the status creator
SAMPLE
గురుతు చెరిపివేసి జీవించాలనిచెరపలేకపోతే మరణించాలనితెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడినిగుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీముక్కలలో లెక్కలేని రూపాలలోముక్కలలో లెక్కలేని రూపాలలోమరల మరల నిన్ను చూసి …
Preview the status creator