తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు || telisindi kada nedu gelupenth rucho chudu lyrics

ante_enti_fallback_image

తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు || telisindi kada nedu gelupenth rucho chudu lyrics

తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు

థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాం
కథకళితో మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పగపగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం

పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయం
పనిపడితే మన మనసె మనకు సాయం
పడగొడితే కనబడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదలి మరో ముందడుగేద్దాం
వెనకతరం చదువుకునే కథ మనమౌదాం

error: Content is protected !!