Skip to content
Telugu Lyrics

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి || uppongele godavari ugindile chelo vari lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
షడ్యమాం భవతి వేదంపంచమాం భవతి నాదంశ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరివేదమంటి మా గోదారిశబరి కలిసిన గోద…
Preview the status creator
SAMPLE
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యంవేసే అట్లు వేయంగానే లాభసాటి బేరంఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యంఆరేసేటి అందాల…
Preview the status creator