Skip to content
Telugu Lyrics

ముసుగు వెయ్యొద్దు మనసు మీద || musugu veyyoddu manasu meeda lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా

సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు

కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ముసుగు వెయ్యొద్దు మనసు మీదవలలు వెయ్యొద్దు వయసు మీదఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతోఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరాఅనుభవించందే తెలియదంటే తప్పు అంటారామనసు చెప్పిందే మనకు వేదం క…
Preview the status creator
SAMPLE
కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగకోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగాకాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగాఅంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగానిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అ…
Preview the status creator