Skip to content
Telugu Lyrics

ఏదో ఏదో అయిపోతుంది || edo edo ayipotundi lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని నీతో ఉండాలని
నేనే ఓడాలని నువ్వే గెలవాలని
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది
వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఏదో ఏదో అయిపోతుందిఎదలో ఏదో మొదలయ్యిందినిన్నే చూడాలని నీతో ఉండాలనినేనే ఓడాలని నువ్వే గెలవాలనిపదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుందిఅది ప్రేమో ఏమో తెలియని వింత యాతనఅది ప్రేమేనేమో ఎరుగ…
Preview the status creator
SAMPLE
ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటేమోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటేఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటేఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటేఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాకప్రాయం వచ్చినాక పర…
Preview the status creator