Skip to content
Telugu Lyrics

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో || ae teega poovuno a komma tetino lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో

అప్పడియన్న ?
హ హ హ అర్ధం కాలేదా ?

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది

ఆహా ! అప్పడియా !
హ ! పెద్ద అర్ధం అయినట్టు !

భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినదీ
మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది

ఏయ్ నీ రొంబ అళగా ఇరికే..
హా..రొంబా? అంటే ?

ఎల్లలు ఏవీ వొల్లనన్నది
నీదీనాదోక లొకమన్నదీ
నీదీనాదోక లొకమన్నది !

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది

నల్ల పొన్ను..అంటే నల్ల పిల్లా !

మొదటి కలయికే ముడివేసినది
తుదిదాకా ఇది నిలకడైనదీ
తుదిదాకా ఇది నిలకడైనది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినోకలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పడియన్న ?హ హ హ అర్ధం కాలేదా ?
Preview the status creator
SAMPLE
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినోకలిపింది ఏ వింత అనుబంధమౌనోతెలిసీ తెలియని అబిమానమౌనో
మనసు మూగది మాటలు రానిదిమమత ఒకటే అది నేర్చినది
Preview the status creator