ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై..
స్వప్నాలే..స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై
సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీబంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగామందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగాపరువాలే..ప్రణయాలై..స్వప్నాలే..…