ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి
యేవేవొ కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి
చరణం 1
అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
యెలేలొ అని గోదారి నాతొ ఊసులు ఆడలి
ఇంధ్ర ధనసుని ఊయల గ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కల్లాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి
చరణం 2
నా వాడు ఎక్కడున్న సరె రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడుంటు యెన్నడైన సరె పసి పాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
యేనాడు నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటెభూలోకం నన్ను నిద్దురపుచ్చాలిజాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపిరెయ్యంత తెగ అల్లరి చెయ్యాలియేవేవొ కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలిగుండె…
చరణం 2నా వాడు ఎక్కడున్న సరె రారాజల్లె నను చేరుకోవాలినా తోడుంటు యెన్నడైన సరె పసి పాపల్లె నను చూసుకోవాలిఅమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపినాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలిప్రేమ లోన …