Skip to content
Telugu Lyrics

చెలియా చెలియా చేజారి వెళ్ళకే || chelia chelia chejari vellake lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా వంటరిని చేయకే
నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడి లేచే ఎరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకే దాకా ఆగదు నా కేక

కదలికే తెలియని శిలని కదిలిం ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా

నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా దారి చూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చెలియా చెలియా చేజారి వెళ్ళకేసఖియా సఖియా వంటరిని చేయకేనడి రేయి పగలు చూడకసుడిగాలై వస్తా సూటిగాఎడబాటే బాటై రానా నీదాకాపడి లేచే ఎరటం తీరుగాదిశలన్నీ దాటే హోరుగానిను తాకే దాకా ఆగదు నా కేక
కదలిక…
Preview the status creator
SAMPLE
నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనాచెలిమితో సమరమా ఇంతగా పంతమానిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనానమ్మవేం ప్రణయమా అంత సందేహమావేరుచేసే కాలమా చేరువైతే నేరమాదాడి చేసే దూరమా దారి చూపుమావిరహాలే …
Preview the status creator