Skip to content
Telugu Lyrics

చిట్టి నడుమునే చూస్తున్నా || chitti nadumune chustunna lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నా
చెవినపడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

నంగనాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది
పాములాగ పగ పడుతుంది
కళ్ళుమూసినా ఎదరే ఉంది
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
ఈ తికమక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి

ఎన్ని తిట్టినా వింటానే
కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా ఓకేనే
ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హైరే హైరే ఏ ప్రాణహాని రానీ
హైరె హైరె ఇక ఏమైనా కానీ
నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నాకంటపడదు ఇక ఎదురేమున్నాచుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నాచెవినపడదు ఎవరేమంటున్నానడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణఅడుగే పడదే ఇక ఎటుపోదామన్నాఆ…
Preview the status creator
SAMPLE
ఎన్ని తిట్టినా వింటానేకాలదన్నినా పడతానేనడుము తడమనీ నన్నొకసారిఉరిమి చూసినా ఓకేనేఉరే వేసినా కాదననేతొడిమి చిదిమి చెబుతానే సారీహైరే హైరే ఏ ప్రాణహాని రానీహైరె హైరె ఇక ఏమైనా కానీనిను నిమరకా నా …
Preview the status creator