Skip to content
Telugu Lyrics

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక || ekkada ekkada ekkada undo taraka lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా

చరణం 1
కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

చరణం 2
ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకనాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకనాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదోపూవానగా కురుస్త…
Preview the status creator
SAMPLE
చరణం 2ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటనిఅడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునిమెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలనిఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనిఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి ద…
Preview the status creator