Skip to content
Telugu Lyrics

Govullu tellana gopayya nallana Telugu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన 

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ 
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో 
 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా 
ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే  దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు..  పాపం 
అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ 
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా 
ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే  దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన 

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావ…
Preview the status creator