Skip to content
Telugu Lyrics

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం || hrudayam orchukolenidi.. gaayam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాదా
నిలువవే కడదాకా
జీవం ..లో ఒదగవే ఒంటరిగా
లో..లో ముగిసే మౌనంగా
ఓ ఓ ఓఓఓ…ఓ ఓ ఓఓఓ…

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

ఊహల లోకంలో ఎగరకు అన్నావే..
తేలని మైకంలో పడకని ఆపావే..
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో
బలికోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడు
అంతటి దూరం ఉండే బ్రతికించే వరమౌతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హలాహలం నాకు సొంతం
నువు తీసుకో అమృతం
అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
హృదయం ఓర్చుకోలేనిదీ..గాయంఇకపై తలచుకోరానిదీ ఈ నిజంపెదవులు విడిరాదానిలువవే కడదాకాజీవం ..లో ఒదగవే ఒంటరిగాలో..లో ముగిసే మౌనంగాఓ ఓ ఓఓఓ…ఓ ఓ ఓఓఓ…
హృదయం ఓర్చుకోలేనిదీ..గాయంఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
Preview the status creator
SAMPLE
ఊహల లోకంలో ఎగరకు అన్నావే..తేలని మైకంలో పడకని ఆపావే..ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మాతెలవారి తొలి కాంతి నీవోబలికోరు పంతానివోఅని ఎవరినడగాలి ఏ…
Preview the status creator