Skip to content
Telugu Lyrics

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది || jagamantha kutumbam nadi ekaki jeevitam naadi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం 1…
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల్ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం 2 ..
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం 3…
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదిజగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదిసంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావేజగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
చరణం 1…కవినై కవితనై భార్యనై భర్తనైకవినై కవ…
Preview the status creator
SAMPLE
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
చరణం 2 ..మింటికి కంటిని నేనైకంటను మంటను నేనై
Preview the status creator