Skip to content
Telugu Lyrics

జీవన వాహిని … పావని || jeevana vahini … pavani lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఓం ఓం
జీవన వాహిని … పావని
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసను అలకనందమై
సగర కులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా
శివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓం ఓంజీవన వాహిని … పావనికలియుగమున కల్పతరువు నీడ నీవనికనులు తుడుచు కామధేను తోడు నీవనివరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవినిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనిభువిని తడిపి దివిగ మలచి స…
Preview the status creator
SAMPLE
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి
జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగాశివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగాగండాలను పాపాలను కడిగివేయగా ముక్తి…
Preview the status creator