లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది
లలిత||
రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
లలిత||
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ
లలిత||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
లలిత ప్రియ కమలం విరిసినదిలలిత ప్రియ కమలం విరిసినదికన్నుల కొలనిదిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఅమృత కలశముగా ప్రతినిమిషంఅమృత కలశముగా ప్రతినిమిషంకలిమికి ద…
రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయంనేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువంకలల విరుల వనం మన హృదయంకలల విరుల వనం మన హృదయంవలచిన ఆమని కూరిమి నీ…