Skip to content
Telugu Lyrics

Nemaliki nerpina nadakalivi lyrics Telugu

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివి

కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు
కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
ఓ ఓ ఓ  నెమలికి నేర్పిన నడకలివి

చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!

ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నెమలికి నేర్పిన నడకలివిమురళికి అందని పలుకులివిశృంగార సంగీత నృత్యాభినయ వేళ..చూడాలి నా నాట్యలీల!!నెమలికి నేర్పిన నడకలివిమురళికి అందని పలుకులివిశృంగార సంగీత నృత్యాభినయ వేళ..చూడాలి నా నాట్యలీ…
Preview the status creator
SAMPLE
చిరునవ్వులు అభినవ మల్లికలు..సిరిమువ్వలు అభినయ గీతికలు..చిరునవ్వులు అభినవ మల్లికలు..సిరిమువ్వలు అభినయ గీతికలు..నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..నీలాల కన్నుల్లో తారకలు.. త…
Preview the status creator