నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
రామచక్కని సీతకి
ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి
ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణమధుర వదన నలిన నయన మనవి వినరా రామా
రామచక్కని సీతకి అరచేత గోరింటఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంటరామచక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడేఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడేఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలోరామచక్కని సీతకి
ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటేచూడలేదని పెదవి…