నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకు
అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ ఙాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా
ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్టదిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులు
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా
ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా తనకే ఈ సంకెలా
ఒడిలో పడితే ఎలా అడుగే కదిలేదెలా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగువేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదునేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకుఅన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదునీలో నా సంతక…
ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులుచుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలుదుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులుఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులుమనసే దోస్తే ఎలా తనక…