Skip to content
Telugu Lyrics

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు || o manasa o manasa chebite vinava nuvvu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా

ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలలే తరిమే ఓ మనసా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వునీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వుచెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనంచెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణంగతమే మరిచి బ్రతకాలే మనసా
ఎగసి పడే అల కోసం దిగివస…
Preview the status creator
SAMPLE
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వునీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌకతననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగాకడలిలోనే ఆగుతుందా కదలనంటు ఏ పయనంవెలుగు వైపు చూడ…
Preview the status creator