Skip to content
Telugu Lyrics

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని || okka sari cheppaleva nuvvu nachchavani lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా

అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావనిచెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసనిమన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంతఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళవెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరినిదురపోయే మదిన…
Preview the status creator
SAMPLE
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతోచుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందాఅంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితోకెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందామనసుంటే మార్గం ఉంది …
Preview the status creator