Skip to content

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ….. జతులాడ……..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే…… మదిపాడే……
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే…. విరబూసే……
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై (2)
ఆడ.. జతులాడ…
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగసందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలైఆడ….. జతులాడ……..పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగసందేళలా…
Preview the status creator
SAMPLE
పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగాకట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగాఅరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులేఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులేఅల ఎంకి పాటలే ఇల పూలతోటలైపసిమొగ్గ రేకుల…
Preview the status creator