రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళినవరస మురళి ఆ నందన మురళిఇదేనా ఆ మురళి మోహన మురళిఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగలఆబాలగోపాలం ఆ బాలగోపాలునిఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడతాండ…
అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించిజీవనరాగమై బృందావన గీతమైకన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళిఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళినటనల …