సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం ! హ !
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూ
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూ
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
అదరనీ బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహర్షి !
వేడితే లేడి వొడి చేరుతుందా వేట సాగాలి కాదా
వోడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతమూ సొంతమూ పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండనూ
భీరువల్లే పారిపోను రేయి వొళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమాపౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమాలోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమానా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా
సా…
నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం ! హ !కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనాలాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండాతప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూకష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూఊరుకుంటే కాలమంతా…