Skip to content
Telugu Lyrics

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ || santosham sagam balam haig navvamma lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మనవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలినవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
నిన్నటి నీడలే కనుపాపని ఆపితేరేపటి వైపుగా నీ చూపు సాగదుగానిన్నటి నీడలే …
Preview the status creator
SAMPLE
ఆశలు రేపినా అడియాశలు చూపినాసాగే జీవితం అడుగైనా ఆగదుగాఆశలు రేపినా అడియాశలు చూపినాసాగే జీవితం అడుగైనా ఆగదుగానిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూనిద్ర మానుకోగలమాఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంట…
Preview the status creator