Skip to content
Telugu Lyrics

సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్ || sapatu yetuladu pataina padu brother lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు||

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ||మన||
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్
సాపాటు||

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెయ్ బ్రదర్
సాపాటు||

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
సాపాటు||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్సాపాటు||
మన తల్లి అన్నపూర్ణ మన అ…
Preview the status creator
SAMPLE
బంగారు పంట మనది మిన్నేరు గంగ మనదిఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురాఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పాఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పాఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పాఆవేశం ఆపుకోని అమ్…
Preview the status creator