సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగా కనలేదే మనసా
నడి రాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చంద్రుడి యదలో మంటని వెన్నెల అనుకుంటారనీ
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ
జాబిలినీ వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ
రూపం లేదు కనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా..
నడి రాతిరి నడక కడతేరదు తెలుసా….
పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా
సంద్రం లో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగిన మదికీ కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంటపడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా……
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనారెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనానిను నీవే సరిగా కనలేదే మనసానడి రాతిరి నడక కడతేరదు తెలుసాఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవాఎన్నో…
పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునాసంద్రం లో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడోసందేహం కలిగిన మదికీ కలతను తీర్చేదెవరోశాపం లాగ వెంటపడుతున్న గతం ఏదైనాదీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా……