తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు
థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాం
కథకళితో మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పగపగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం
పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయం
పనిపడితే మన మనసె మనకు సాయం
పడగొడితే కనబడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదలి మరో ముందడుగేద్దాం
వెనకతరం చదువుకునే కథ మనమౌదాం
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడుతెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడుతన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడుఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు
థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాంకథకళితో మన పదము కది…
పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయంపనిపడితే మన మనసె మనకు సాయంపడగొడితే కనబడని పిరికి సమయంవెలుగవదా తను చేసిన ప్రతి గాయంకయ్యం కోరిందంటే కాలం ఓడాలంతేప్రతి విజయం వదలి మరో ముందడుగేద్దాంవెనకతరం చదువ…