నేననీ నీవనీ వేరుగా లేమనీ || nenni neevani veruga lemani lyrics

ante_enti_fallback_image

నేననీ నీవనీ వేరుగా లేమనీ || nenni neevani veruga lemani lyrics

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..

మొదటి సారి..మదిని చేరి..
నిదర లేపిన ఉదయమా
వయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా..మరో పుట్టుకా..అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..

పదము నాది..పరుగు నీది..రథము వేయ్‌రా ప్రియతమా..
తగువు నాది..తెగువ నీది..గెలుచుకో పురుషోత్తమా..
నువ్వే దారిగా నేనే చేరగా..ఎటూ చూడక వెనువెంటే రానా..

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..

error: Content is protected !!