గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే || gallo telinattunde gunde pelinattumde lyrics

ante_enti_fallback_image

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే || gallo telinattunde gunde pelinattumde lyrics

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్లు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువు నా కళ్లకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి

నిదుర దాటి కలలే పొంగే
పెదవి దాటి పిలుపే పొంగే
అదుపు దాటి మనసే పొంగే నాలో
గడప దాటి వలపే పొంగే
చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్లు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే

తలపు దాటి తనువే పొంగే
సిగ్గు దాటి చనువే పొంగే
గట్టు దాటి వయసే పొంగే లోలో
కనులు దాటి చూపే పొంగే
అడుగు దాటి పరుగే పొంగే
హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి

error: Content is protected !!