ఆకాశగంగా || akasaganga lyrics

ante_enti_fallback_image

ఆకాశగంగా || akasaganga lyrics

ఆకాశగంగా !
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా ..

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా..

కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వె
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వె
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే

చిటపటలాడి..వెలసిన వానా
మెరుపుల దాడి..కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడీ ..

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !

ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా

మనసుని నీతో..పంపేస్తున్నా..
నీ ప్రతి మలుపూ..తెలుపవె అన్నా..
ఆ జాడలన్నీ వెతికి..నిన్ను చేరనా

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా

నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా

ఆకాశగంగా ..

error: Content is protected !!