జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే || jallanta kavvinta kavalile ollanta tullinta ravalile lyrics

ante_enti_fallback_image

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే || jallanta kavvinta kavalile ollanta tullinta ravalile lyrics

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం 1
వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

చరణం 2
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
మాయదేవుడే మొగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికొసమో

error: Content is protected !!