ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి || uppongele godavari ugindile chelo vari lyrics

ante_enti_fallback_image

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి || uppongele godavari ugindile chelo vari lyrics

షడ్జమం భవతి వేదం
పంచమం భవతి నాదం
శ్రుతి శిఖరే నిగమహరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోరుసేయ్ నావ
బారు సేయ్ వాలుగా చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతగా

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం
ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాదా

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకంతాల వలపు
అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

error: Content is protected !!