అందం గా లేనా..అసలేం బాలేనా || andam ga lena.. asalem balena lyrics

Pinterest
X
WhatsApp

అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

అలుసైపోయానా..అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా

అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

కనులు కలపవాయే..మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే..మాట వరసకీ
కలికి చిలకనాయే..కలత నిదురలాయే
మరవలేక నిన్నే..మధన పడితినే

ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

నీకు మనసు ఇచ్చా..ఇచ్చి నపుడె నచ్చా
కనుల కబురు తెచ్చా..తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచూ..తెలుపలేదు మనసూ
మహా తెలియనట్టూ..నటనలే అనీ

ఎన్నెల్లో గోదారి..తిన్నెల్లో నన్నూ
తరగల్లే నురగల్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా

అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

అలుసైపోయానా..అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా

అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!