విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ || vidhi cheyu vintalanni.. mathileni chethalenani lyrics

ante_enti_fallback_image

విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ || vidhi cheyu vintalanni.. mathileni chethalenani lyrics

విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో

విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో

ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలా
విరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా

అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువని
తుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో

విధి చేయు వింతలన్నీ..

వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ ఇలలో..
కులము మతమూ ధనము బలమూ గొంతు కోసెను తుదిలో..

అది నేడు జరుగ రాదనీ..ఎడబాసి వేచినాము
మన గాధె యువతరాలకూ..కావాలీ మరో చరిత్రా !
కావాలీ మరో చరిత్రా !

error: Content is protected !!