నువ్వేనా నా నువ్వేనా || nuvvena naa nuvvena lyrics

ante_enti_fallback_image

నువ్వేనా నా నువ్వేనా || nuvvena naa nuvvena lyrics

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనా
మాటలాడే చూపులన్ని మౌన రాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా..ఆ
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

చరణం 1
మేఘమల్లె సాగి వచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి
తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన
దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

చరణం 2
కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టు కుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక యెన్నెలల్లె నీవు
ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత
గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమెనా ఆనందమేనా

error: Content is protected !!