ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం || ontariga digulu baruvu moya boku nestham lyrics

ante_enti_fallback_image

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం || ontariga digulu baruvu moya boku nestham lyrics

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది
దుఖ్ఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా
ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4)
గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4)
కోకిలల కుటుంబములో చెడబుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నే ఏకాకిని

చరణం 1
పాత పాట మారాలని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట(2)
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట(2)

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది(2)
ఏటి పొడుగున వసంతం ఒకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోనికేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
అది అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్తకోకిలా
కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాశనం
కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది(2)

చరణం 2
అసహాయతలో దడ దడ లాదే హృదయ మృదంగ ద్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రుతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జనజీవిని ఒద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

చరణం 3
నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను

సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాక
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం

error: Content is protected !!