శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి || shruti neevu gati neevu e naa kriti neevu bharathi lyrics

ante_enti_fallback_image

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి || shruti neevu gati neevu e naa kriti neevu bharathi lyrics

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధము
నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం

error: Content is protected !!