అదే నీవు అదే నేను అదే గీతం పాడనా || ade neevu ade nenu ade geetam paadana lyrics

ante_enti_fallback_image

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా || ade neevu ade nenu ade geetam paadana lyrics

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేని గానము

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశగా
అదే బాసగా అదే ఆశగా
ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను

error: Content is protected !!