Skip to content
Telugu Lyrics

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం || bhugolanto bantat adalandi mana padam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందోబ్రహ్మ అంది మన వేగం

కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం
పదమందీ నవయవ్వనంలో పసితనం
దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం
కలనైనా తరిమేగుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీక్షణం

అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం
మనకింకా తెలియదు కద భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదంపూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయంపడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలంఆనందోబ్రహ్మ అంది మన వేగం
కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాంపదమందీ నవయవ్వనంలో పసితనందొ…
Preview the status creator
SAMPLE
అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములంమనకింకా తెలియదు కద భయమన్నదిపిల్లగాలై ఎదురేగుదాం గగనానికిఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులాస్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా
Preview the status creator